కేక పుట్టిస్తున్న కెజిఎఫ్ సెకండ్ పోస్టర్

కన్నడలో తెరకెక్కిన కెజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రీలీజ్ అయ్యి ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో యశ్ స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా కెజీఎఫ్ 2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా అది భీబత్సంగా ట్రెండ్ అయ్యింది.

కాగా ఇప్పుడు తాజాగా కెజీఎఫ్ సెకండ్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. చేతిలో ఆయుధం పట్టుకుని చాలా ఇంటెన్స్‌తో ఉన్న యశ్ లుక్ కేక పుట్టిస్తోంది. ఈ సినిమా ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అనే చర్చ అన్ని భాషల ఇండస్ట్రీల్లో మొదలైంది.

పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను ఈ సినిమాతో అలరించిన యశ్, మరోసారి వారికి ఫుల్ మీల్స్ వడ్డించేందుకు రెడీ అవుతున్నాడు. యశ్ యాక్టింగ్, అదిరిపోయే స్టోరీతో మరోసారి ప్రేక్షకులను కెజీఎఫ్ మేనియాలో ముంచేయడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. కాగా తాజాగా రిలీజ్ అయిన యశ్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రీలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు.

Leave a comment