మిల్కీ బ్యూటీతో మహేష్ స్టెప్పులు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పూర్తి ఎంటర్‌టైనర్ సినిమాగా దర్శకుడు అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ ఐటెం సాంగ్ చేయిస్తారని చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది.

ఇప్పుడు తాజాగా మహేష్, తమన్నాల మధ్య సాగే ఈ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించారు చిత్ర యూనిట్. కాగా మహేష్ గత సినిమాల్లో ఐటెం సాంగులు సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో తమన్నాతో మహేష్ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని అంటోన్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపాడు.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తోండగా అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోండగా అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Leave a comment