రజినీతో మహానటి.. నమ్మలేకపోతున్న బ్యూటీ

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి బ్యూటీ కూడా నో చెప్పలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతోంది మహానటి హీరోయిన్ కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ మహానటి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ మూవీ మేకర్స్‌ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సరసన హీరోయిన్‌గా చేసే ఛాన్స్ కొట్టేసింది.

తమిళ దర్శకుడు శివ తన నెక్ట్స్ మూవీని తలైవా రజినీతో చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని అమ్మడు తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి మరీ చెప్పింది. ఇది నిజంగా తనకు కలలాగా ఉందంటూ ఉబ్బితబ్బిబవుతోంది.

మొత్తానికి రజినీకాంత్ సరసన హీరోయిన్ పాత్ర అంటే మామూలు అదృష్టం కాదని కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమాను తన జీవితంలో మరిచిపోలేనంటూ కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన వారందరికీ థ్యాంక్స్ అంటోంది మహానటి బ్యూటీ.

Leave a comment