బాలయ్యను వెనక్కి నెట్టిన బోయపాటి

నందమూరి బాలయ్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రూలర్ డిసెంబర్ 20న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో మనల్ని అలరించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా తరువాత మరోసారి తనకు ఎంతో కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమాను ప్రారంభించాడు బాలయ్య.

పక్కా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు బాలయ్య పారితోషకం కింద రూ.10 కోట్లు తీసుకుంటున్నాడు. బాలయ్య కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పాలి. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకు గాను తీసుకుంటున్న మొత్తం రూ.15కోట్లు. అంటే బాలయ్య కంటే కూడా బోయపాటి 5 కోట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు.

బాలయ్య కెరీర్‌లో ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ అవుతుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో, ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

Leave a comment