ఎటూ కానీ సమయంలో లవ్ స్టోరీ చెబుతున్న సాయి పల్లవి

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ సినిమాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోండగా ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు అనుకున్నాయి. కానీ ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా రిలీజ్ డేట్‌ను ఏప్రిల్‌కు మార్చినట్లు తెలుస్తోంది.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చైతు కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 2వరకు ఆగాల్సిందే.

Leave a comment