టక్ చేసుకొచ్చిన నాని.. ఎలా ఉంటుందో మరి?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే జెర్సీ, గ్యాంగ్‌లీడర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న నాని తన తరువాత చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. టక్ జగదీష్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాని అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

ఈ ఫస్ట్‌లుక్ చూస్తే సినిమాలో ఏదో కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు నాని ఫ్యాన్స్ చెబుతున్నారు. కాన్సెప్ట్‌ లేనిదో నాని సినిమా చేయడని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టక్ చేసుకుని మరీ నాని ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తాడో చూడాలి అంటున్నారు అభిమానులు. ఇకపోతే ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో నిన్ను కోరి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ వచ్చింది. మరోసారి ఈ కాంబో నుండి అదిరిపోయే సినిమా రావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. మజిలీ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతిత్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Leave a comment