అప్పుడు నై.. ఇప్పుడు సై

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో త్రివిక్రమ్, తారక్ తమ కాంబోను మరోసారి రిపీట్ చేయాలిన ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటించాలని ఓ సీనియర్ హీరోయిన్‌ను త్రివిక్రమ్ అప్పట్లో కోరగా ఆమె ససేమిరా అన్నట్లు వార్తలు అప్పట్లో షికారు చేశాయి. కాగా ఇప్పుడు ఆమె తారక్‌తో తప్పక స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని తన మనసులోని మాటను చెప్పింది.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? ఒకప్పుడు హీరోయిన్‌గా తనదైన మార్క్ వేసిన లయ. హీరోయిన్‌గా సక్సె్స్ సినిమాల్లో నటించిన ఆమె దాదాపు అందరూ స్టార్ హీరోలతో చేసింది. ఆపై పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యి సినిమాలకు దూరంగా ఉంటుంది. కాగా అరవింద సమేతలో రెడ్డమ్మ పాత్ర కోసం ఆమెను త్రివిక్రమ్ నటించాలని కోరాడు. కానీ తల్లి పాత్రలకు తాను అప్పుడే సిద్ధంగా లేనని ఆమె ఆ పాత్రను తిరస్కరించింది.

కాగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోని చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్‌తో కలిసి తప్పకుండా స్క్రీన్ షేర్ చేసుకుంటానంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. అప్పుడు తారక్ సినిమాను వద్దని, ఇప్పుడు కావాలనడంతో ఆమె ఎందుకు అలా అంటుందో అర్ధం కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment