షకీలాను ఇప్పటికీ వదలని సెన్సార్ బోర్డు.. అంతా దాని కోసమేనట!

శృంగార సినిమాల్లో నటించిన షకీలా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఒకప్పుడు షకీలా సినిమా అంటే ఊళ్లలో ఎలాంటి రచ్చ ఉండేదో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల సినిమాకంటే కూడా షకీలా సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉండేది. షకీలా సినిమా ఉందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమా రిలీజ్‌లను వాయిదా వేసుకునే వారు.

ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు షకీలా క్యారెక్టర్ పాత్రలు చేస్తూ కాలం గడుపుతోంది. కాగా ఆమె నటించిన తాజా చిత్రం లేడీస్ నాట్ అలవ్డ్. ఈ సినిమాను షకీలా స్వయంగా ప్రొడ్యూస్ కూడా చేసింద. అయితే ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ బోర్డు వాళ్లు ససేమిరా అంటోన్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేశారు. అయితే వారు తన సినిమాను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ షకీలా ఫైర్ అవుతోంది.

కొందరు సెన్సార్ బోర్డు సభ్యులు తనవద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెద్ద సినిమాల నిర్మాతలు వారు డబ్బులు ఎందుకు డిమండ్ చేయరంటూ ఫైర్ అయ్యింది. తన వద్ద దీనికి సంబంధించిన రికార్డింగ్స్ ఉన్నాయని, అవి బయటపెడితే వారి భాగోతం బట్టబయలవుతుందని ఆమె హెచ్చరిస్తోంది. మరి లేడీస్ నాట్ అలవ్డ్ సినిమాలో రిజెక్ట్ చేసే అంశాలు ఏం ఉన్నాయో చూడాలి.

Leave a comment