మళ్లీ తారక్‌కే ఓటేసిన బాస్

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తొలి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా అది బిగ్గెస్ట్ హిట్ షోగా నిలిచింది. ఆ తరువాత రెండో సీజన్‌ను నాని, మూడో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేసి బిగ్‌బాస్ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు.

ఇప్పుడు నాలుగో సీజన్‌కు బిగ్‌బాస్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి కూడా బిగ్‌బాస్ టీఆర్‌పీలు ఆకాశాన్ని తాకేటట్లు ఉండేలా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్ హోస్ట్ చేసేందుకు మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తారక్ అయితే మరోసారి బిగ్‌బాస్ సీజన్‌ను సూపర్ సక్సెస్‌ చేయగలడని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇకపోతే నాని హోస్ట్ చేసిన సీజన్ 2 పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగ్ హోస్ట్ చేసిన సీజన్ 3 కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో తారక్ అయితేనే మళ్లీ బిగ్‌బాస్‌కు పూర్తి న్యాయం చేయగలడని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి తారక్ బిగ్‌బాస్ 4వ సీజన్‌ను హోస్ట్ చేస్తాడా లేడా అనేది మాత్రం చూడాలి.

Leave a comment