కనిపించకుండా పోతున్న మెగా హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన అల వైకుంఠపురములో చిత్రాన్ని తాజాగా రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా తరువాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా నెలరోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లనున్నాడట. ఈ సినిమాలో బన్నీ ఓ సరికొత్త లుక్‌లో కనిపించేందుకు గడ్డం పెంచాల్సిందిగా సుకుమార్ కోరాడట.

దీనికోసమే బన్నీ నెలరోజులపాటు ఎవ్వరికీ కనిపించడని తెలుస్తోంది. అటు అల వైకుంఠపురములో సినిమాతో బన్నీ త్రివిక్రమ్ మరోసారి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌పై కన్నేశారు. ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

Leave a comment