సాయి ధరమ్ తేజ్ కూడా అదే బాటలో..?

మెగా అల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరోగా మారి తనదైన మార్క్ వేసుకున్నాడు. వరుస హిట్ల తరువాత సాయి ధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇటీవల చిత్రలహరి చిత్రంతో మోస్తరు హిట్ అందుకున్న తేజ్ తాజాగా నటిస్తోన్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది రిలీజ్‌కు రెడీ అయ్యింది.

దర్శకుడు మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఇతర హీరోల బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని టాప్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు తమ సిక్స్ ప్యాక్ బాడీలను ఆడియెన్స్‌కు చూపించి ఇంప్రెస్ చేశారు. కాగా సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇప్పటివరకు తన బాడీని చూపించలేదు. దీంతో ప్రతిరోజూ పండగే చిత్రంలో తన బాడీని చూపించేందుకు తేజ్ సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమా కోసం తేజు కండలు పెంచాడట. ఓ సీన్‌లో తేజ్ బాడీని చూపించిన మారుతి అండ్ టీమ్ ఆ సీన్‌కు సంబంధించిన ఫోటోను ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో తేజు సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

Leave a comment