మహేష్‌ను బుట్టలో వేసిన ఐరన్ లెగ్ బ్యూటీ

మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మహేష్ తన తరువాత చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ శృతి హసన్‌ను తీసుకునేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. గతంలో శ్రీమంతుడు చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి పేరు లభించింది. అయితే కెరీర్ తొలిరోజుల్లో శృతిహాసన్‌కు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే తన ప్రేమాయణంతో సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, అది కాస్త బ్రేక్ కావడంతో ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తోంది.

ఇప్పటికే రవితేజ-గోపీచంద్ మలినేని చిత్రంలో నటిస్తోన్న శృతి హాసన్ అటుపై మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మహేష్ బాబు మరోసారి శృతి హాసన్‌కు ఛాన్స్ ఇస్తాడో లేడో చూడాలి.