Moviesవెంకీ మామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

వెంకీ మామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

రియల్ లైఫ్‌లో మామఅల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రల్లో కలిసి నటించిన చిత్రం వెంకీ మామ. ఈ సినిమాకు మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పూర్తి ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కిన వెంకీ మామ సినిమా చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు లైన్ కట్టారు. ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ రావడంతో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో ఈ సినిమా విజయం సాధించింది.

ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.7 కోట్ల మేర వసూళ్లు సాధించగా, శనివారం రూ.5 కోట్లు, ఆదివారం రూ.5 కోట్లు సాధించింది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.17.78 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బీ, సీ సెంటర్లతో పాటు కొన్ని ఏ సెంటర్లలో కూడా ఈ సినిమా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా స్టామినా ఏమిటనేది సోమవారం నాడు తేలిపోనుంది.

ఇక ఏరియావారీగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
నైజాం – 6.72 కోట్లు
సీడెడ్ – 3.39 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.25 కోట్లు
ఈస్ట్ – 1.43 కోట్లు
వెస్ట్ – 0.81 కోట్లు
కృష్ణా – 1.04 కోట్లు
గుంటూరు – 1.50 కోట్లు
నెల్లూరు – 0.64 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 17.78 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news