రూలర్ ఇన్‌‌సైడ్ టాక్.. బాలయ్య రొటీన్ కొట్టుడు

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాలయ్య మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించనున్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాను చూసిన చిత్ర వర్గాలు ఈ సినిమా రిజల్ట్‌పై తమ పెదవి విప్పలేదు.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ తప్ప మిగతావారు ఎంజాయ్ చేసేందుకు పెద్దగా మేటర్ ఏమీ లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో రొటీన్ కొట్టుడునే బాలయ్య మరోసారి వడ్డించనున్నాడట. రెండు పాత్రలు, రొటీన్ కథను ఈ సినిమాలో బాలయ్య మనముందుకు మరోసారి తీసుకొస్తాడట. ఈ సినిమాలో కొత్తదనమేది లేదని, కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులనే ఈ సినిమా మెప్పిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

అయితే ఇదంతా కేవలం యాంటీ బాలయ్య ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న రచ్చ అని చెప్పారు బాలయ్య ఫ్యాన్స్. కాగా ఈ సినిమాతో బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ అవుతారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.