బాలకృష్ణ రూలర్ మూవీ ప్రీరివ్యూ

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన జైసింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. దీంతో ఈసారి బాలయ్య ఖచ్చితంగా హిట్ కొడతాడని నందమూరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కాగా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూస్తే ఈ సినిమా కథ ఏమిటో మనకు ఇట్టే అర్ధమవుతోంది. బిజినెస్ చేసే పాత్రలో స్టైలిష్ బాలయ్య మనకు ఈ సినిమాలో కనిపిస్తాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో రైతులపై జరిగే అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. కాగా ఇదే సమయంలో భూమిక పోలీస్ ఆఫీసర్ బాలయ్య గురించి తెలుపుతుంది. ఇక్కడే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందని తెలుస్తోంది. ఇక సెకండాఫ్‌లో పోలీస్ బాలయ్యకు సంబంధించిన కథను డైరెక్టర్ చూపించనున్నాడు.

క్లైమాక్స్‌లో బిజినెస్‌మెన్ అయిన బాలయ్య దుండగుల పని ఎలా చెప్పాడన్నది కథ. అయితే ఇద్దరు బాలయ్యలకు సంబంధం ఏదైనా ఉందా అనేది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తోంది. మొత్తానికి ఓ సామాజిక సమస్యను బాలయ్య ఈ సినిమాలో మనకు చూపించనున్నాడు. ఇక హీరోయిన్లుగా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

అటు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మనముందుకు రానున్నాడు. మరి బాలయ్య మాస్‌కు, తేజ్ క్లాస్‌కు ఆడియెన్స్ ఎటు ఓటేస్తారో తెలియాలంటే మరికొద్ద గంటలు వేచి చూడాల్సిందే. రూలర్ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో కూడా మనకు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.