Moviesవెంకీ మామ 5 రోజుల కలెక్షన్లు

వెంకీ మామ 5 రోజుల కలెక్షన్లు

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం వెంకీ మామ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మంచి టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు. కాగా వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా హౌజ్‌ఫుల్ షోలతో థియేటర్లలో సందడి చేసింది.

అయితే ఈ సినిమా కలెక్షన్లు వర్కింగ్ డేస్‌లో తగ్గుముఖ్యం పట్టాయి. ఈ సినిమా వీకెండ్‌లో కలెక్ట్ చేసిన కలెక్షన్లతో పోల్చుకుంటే వీక్ డేస్ కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఈ సినిమా 5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.20.89 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది. డిసెంబర్ 20న రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా వసూళ్లపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.

ఇక ఏరియాలవారీగా ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 5 రోజుల కలెక్షన్లు
నైజాం – 8.11 కోట్లు
సీడెడ్ – 3.52 కోట్లు
నెల్లూరు – 0.75 కోట్లు
కృష్ణా – 1.25 కోట్లు
గుంటూరు – 1.74 కోట్లు
వైజాగ్ – 2.85 కోట్లు
ఈస్ట్ గోదావరి – 1.69 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.98 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 20.89 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news