మందు ఎక్కువై హీరోయిన్ కాళ్లపై పడ్డ స్టార్ డైరెక్టర్

మందెక్కువైన ఓ స్టార్ డైరెక్టర్ హీరోయిన్‌తో చేసిన పనికి చిత్ర యూనిట్‌పాటు అక్కడున్నవారందరూ షాక్ అయ్యారు. బ్యూటీఫుల్ అనే సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు డైరెక్ట్ చేయగా నైనా గంగూలీ, సూరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి వర్మ పాల్గొన్నారు.

ఈ సినిమాకు వర్మ కథ అందించడంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రమోషన్స్ ఈవెంట్‌లో వర్మ రెచ్చిపోయాడు. హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి రెచ్చిపోయి చిందులేశాడు. అంతేగాక ఓ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ నైనా గంగూలీ కాళ్లపై పడ్డాడు వర్మ. దీంతో ఆ హీరోయిన్‌తో పాటు అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. వర్మ ఏమిటి ఇలా చేస్తున్నాడని వారంతా నోరెళ్లబెట్టారు.

కాగా వర్మ అప్పటికే వోడ్కా చుక్క వేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న మీడియా వారికి ఈ ఘటన ఫుల్ మీల్స్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో వర్మ మందేసి రెచ్చిపోయాడంటూ పలు కథనాలు రాస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ వార్త సెన్సేషన్‌గా మారింది. అసలే వివాదాలకు కేరాఫ్‌గా ఉండే వర్మ, ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తాడో చూడాలి అంటున్నారు సినీ జనం.

Leave a comment