ప్రతిరోజూ పండగే 10 రోజుల కలెక్షన్స్.. తేజు కెరీర్‌లోనే బెస్ట్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లతో రెచ్చిపోయాడు. కాగా గతకొంత కాలంగా దారుణమైన ఫ్లాపులతో కెరీర్‌ అస్తవ్యస్తంగా సాగుతున్న తేజు ఒక సూపర్ సక్సెస్ కోసం చాలా ఆశగా వెయిట్ చేస్తూ వచ్చాడు. వరుస సినిమాల దర్శుకుడు మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్‌తో పాటు కథ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చడంతో ఈ సినిమాను వారు ఆదరిస్తున్నారు.

రిలీజ్ అయ్యి 10 రోజులు పూర్తయినా ఈ సినిమాకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో ప్రతిరజూ పండగే సినిమాకు మించిన సినిమా లేకపోవడం, రూలర్ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో సాయిధరమ్ తేజ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సినిమాతో తేజు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా దర్శకుడు మారుతి కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఏదేమైనా తేజు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కోసం వెయిట్ చేసిన రోజులతో పోల్చుకుంటే ఈ సినిమా అందించిన సక్సెస్ ఎక్కువ అని చెప్పాలి. ఈ సినిమాకు మరో రెండు వారాల పాటు ఎలాంటి ఢోకా లేదని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ వరకు ప్రతిరోజూ పండగే చేసుకోవడం తేజుకు ఖాయమని అంటున్నారు చిత్ర వర్గాలు.

ఇక ఏరియాలవారీగా ప్రతిరోజూ పండగే 10 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 9.08 కోట్లు
సీడెడ్ – 2.75 కోట్లు
నెల్లూరు – 0.65 కోట్లు
కృష్ణా – 1.52 కోట్లు
గుంటూరు – 1.49 కోట్లు
వైజాగ్ – 3.27 కోట్లు
ఈస్ట్ – 1.51 కోట్లు
వెస్ట్ – 1.15 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 21.42 కోట్లు

Leave a comment