బాలయ్య సినిమాలో ఈసారి లేనట్టే!

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులకు అదిరిపోయే కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ట్రైలర్‌లో రివీల్ చేశారు.

అయితే బాలయ్య ప్రతి సినిమాలో ఉండే అంశం ఒకటి మాత్రం ఈ సినిమాలో లేదని తెలుస్తోంది. బాలయ్య సినిమాల్లో రాజకీయాల గురించి ఏదో ఒక అంశం ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటి రాజకీయాలు లేవంటున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో రూలర్ సినిమా కథను కాస్త లీక్ చేశాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో స్థిరపడ్డ తెలుగువారు అక్కడ ఎదుర్కొంటున్న వివక్షను తొలగించే హీరోగా బాలయ్య మనకు కనిపిస్తాడని కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

దీంతో ఈ సినిమాలో రాజకీయాలు తావు లేకుండా కేవలం బాలయ్య మాస్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని దర్శకుడు కథ రాసుకున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి బాలయ్య గత సినిమాలలో ఉన్న అంశం ఈ సినిమాలో లేకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.