బాలీవుడ్ బ్యూటీతో బాలయ్య చిందులు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం రూలర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. డిసెంబర్ 20న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు ఆయన అభిమానులు. కాగా తన నెక్ట్స్ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఇటీవల ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ బాలీవుడ్ బ్యూటీని ఓకే చేయించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీంతో బాలయ్య సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అటు పలువురు బాలీవుడ్ స్టార్లను కూడా బోయపాటి ఈ సినిమాలో తీసుకోవాలని చూస్తున్నాడు.

దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన బోయపాటి రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో అనేది తెలియాల్సి ఉంది.

Leave a comment