నూలుపోగు లేకుండా కనిపిస్తే కోట్ల వర్షం

బాలీవుడ్ బ్యూటీలు మొదలుకొని టాలీవుడ్ గుమ్మల వరకు నగ్నంగా నటించేందుకు భారీ పారితోషకాలు పుచ్చుకుంటున్నారు. ఇక ఫేం ఉన్న తారలకైతే ఎంతైనా సమర్పించుకునేందుకు నిర్మాతలు రెడీ అంటున్నారు. తమ పారితోషకం ఎంతైనా వారు చెల్లించేందుకు రెడీ అవుతున్నారు. వారు నగ్నంగా కనిపిస్తే చాలనుకునేవారి సంఖ్య కోట్లలో ఉండటంతో ఎంతడిగితే అంత ఇచ్చుకునేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

తాజాగా ఇదే కోవలో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కోసం ప్లేబాయ్ కవర్‌పేజీ నిర్వాహకులు కోట్ల ఆఫర్‌తో ఆమె ముందుకు వచ్చారు. కానీ తమ కవర్‌పేజీపై నగ్నంగా ఫోటోలు దిగాల్సి ఉంటుందని వారు కోరారు. దీనికి నర్గీస్ ఫక్రీ ససేమిరా అన్నది. హాట్ అందాలతో బాలీవుడ్ జనాలకు నిద్ర లేకుండా చేసిన నర్గీస్ ఫక్రీ ఇలా అనేసరికి చాలా మంది హర్ట్ కూడా అయ్యారు. అయితే తనకు నటన విషయంలో, ఎక్స్‌పోజింగ్ విషయంలో కొన్ని హద్దులు ఉన్నాయంటూ నర్గీస్ చెప్పుకొచ్చింది.

మొత్తానికి నర్గీస్‌ను నూలుపోగు లేకుండా చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురయ్యిందని చెప్పాలి. కాగా బాలీవుడ్‌లో ఇప్పటివరకు కేవలం షర్లిన్ చోప్రా మాత్రమే నూలుపోగు లేకుండా దర్శనిమిచ్చింది. ఆమె కూడా సదరు ఫోటోషూట్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Leave a comment