నాగశౌర్య అశ్వధ్ధామ టీజర్.. తుక్కురేగ్గొట్టాడుగా!

యంగ్ హీరో నాగశౌర్య గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక వెనకబడిపోయాడు. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాలుగా నిలుస్తుండటంతో ఆందోళనకు గురయ్యాడు. ఛలో సినిమా తరువాత అంతటి స్థాయి సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చూపించాలని ఫిక్స్ అయ్యాడు ఈ యంగ్ హీరో. దీంతో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను రెడీ చేస్తున్నాడు నాగశౌర్య.

అశ్వధ్ధామ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశాడు ఈ హీరో. ఈ టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని ఇట్టే చెప్పేయొచ్చు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం నాగశౌర్య బాడీని కూడా పెంచాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్ వింటుంటే గూస్‌బంప్స్ రావడం ఖాయం. గమ్యం లేని యుద్ధం అంటూ వచ్చే డైలాగుకు ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు.

మొత్తానికి ఈసారి అదిరిపోయే కంటెంట్‌తో మనముందుకు రానున్నాడు నాగశౌర్య. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను రమణ తేజ డైరెక్ట్ చేస్తుండగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. జనవరి 31న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment