వెంకీ మామ 13 డేస్ కలెక్షన్స్.. జోరు తగ్గని మామాఅల్లుళ్లు

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ‘వెంకీ మామ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దానికి తోడు ఈ సినిమా కంటెంట్‌ కూడా కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు.

ఇక వెంకటేష్ తనదైన మార్క్ కామెడీతో సినిమాను నడిపించిన విధానం ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూశారు జనం. అంతేగాక బాక్సాఫీస్ వద్ద మరే ఇతర సినిమా ఈ సినిమాకు పోటీగా నిలవలేకపోవడంతో వెంకీ మామ కలెక్షన్ల పరంగానూ తన జోరును కొనసాగిస్తోంది. రిలీజ్ అయ్యి 13 రోజులు పూర్తయినా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందంటే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13 రోజులకు గాను ఏకంగా రూ.33.67 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.

వెంకీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా వెంకీ మామ నిలిచింది. రాశిఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా 13 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 13 రోజుల కలెక్షన్స్
నైజాం – 10.92 కోట్లు
సీడెడ్ – 4.42 కోట్లు
నెల్లూరు – 0.93 కోట్లు
కృష్ణా – 1.65 కోట్లు
గుంటూరు – 2.11 కోట్లు
వైజాగ్ – 4.45 కోట్లు
ఈస్ట్ – 2.14 కోట్లు
వెస్ట్ – 1.32 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 27.94 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.58 కోట్లు
ఓవర్సీస్ – 3.15 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – 33.67 కోట్లు

Leave a comment