నిశ్శబ్దం బద్దలు కొట్టిన కోన.. అనుష్క కోసం కాదట!

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ను రిలీజ్‌కు రెడీ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీ్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో అనుష్క ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకోనుందని, సినిమాకు అనుష్క యాక్టింగ్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు కథ అందించిన ప్రముఖ రైటర్ కోన వెంకట్, ఈ సినిమా కథను అనుష్క కోసం రాయలేదని షాక్ ఇచ్చాడు. ఈ సినిమాను తాను వేరే హీరోయిన్‌ కోసం రాశానని తెలిపాడు. ఓసారి ముంబై నుంచి వస్తున్న కోన వెంకట్‌ అనుష్కను చూసి వెంటనే ఈ కథను వినిపించాడు. కథ నచ్చిన అనుష్క తరువాత తనకు ఫోన్ చేసి సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.

ఈ విధంగా నిశ్శబ్దం సినిమాలో అనుష్క నటించిందని కోన చెప్పుకొచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో కలిసి కోన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. హేమంత్ మధుకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా ఇందులో మాధవన్, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజ్ తదితరులు నటిస్తున్నారు. జనవరి 31న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. మరి నిశ్శబ్దం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రీసౌండ్ చేస్తుందో చూడాలి.

Leave a comment