నేనే నెంబర్ వన్ అంటోన్న సన్నీ పాప

అడల్ట్ వీడియోలతో పాపులర్ అయిన సన్నీ లియోన్ ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఈమె పాపులారిటీ ఏ రేంజ్‌లోకి వెళ్లిందంటే గూగుల్‌ సెర్చ్‌లో అత్యధికంగా వెతికిన వ్యక్తులలో సన్నీ లియోన్ వరుసగా రెండుసార్లు టాప్ పొజిషన్‌లో నిలిచింది. కాగా ఇటీవల గూగుల్ సెర్చ్‌లో ఆమె తన స్థానాన్ని కోల్పోయినా మరో సెర్చ్ ఇంజిన్ యాహూలో మాత్రం తన సత్తా చాటుతోంది.

ఈ ఏడాదిలో యాహూ సెర్చ్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో సన్నీ లియోన్ పేరు మొదటి స్థానంలో ఉంది. అటు సన్నీ లియోన్ తరువాత స్థానాల్లో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, ఆలియా భట్ నిలిచారు. ఇక బాలీవుడ్‌లో ఇలాంటి పాత్రలే అంటూ గిరి గీసుకోకుండా దొరికిన ప్రతి పాత్రను పోషిస్తూ దూసుకెళుతోంది సన్నీ. అడపాదడప ఐటెం సాంగ్స్‌లోనూ అమ్మడు తన అందాలతో దుమ్ములేపుతోంది.

కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ సినిమాల్లో సైతం తన సత్తా చాటుతోంది సన్నీ లియోన్. తెలుగులో కరెంట్ తీగ, గరుడ వేగ సినిమాల్లో నటించిన సన్నీ తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. ఏదేమైనా యాహూ సెర్చ్‌లో మాత్రం తానే తోపు అంటోంది సన్నీ లియోన్.

Leave a comment