వాయిదా పడ్డ 90 ML.. అంతా అదే కారణం

RX 100 సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో కార్తీకేయ. ఈ సినిమాతో యూత్‌లో అదిరిపోయే క్రేజ్‌ను సాధించుకున్న కార్తీకేయ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే సరైన హిట్ మాత్రం మనోడి ఖాతాలో పడలేదు. దీంతో తాజాగా 90 ML అనే సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమాలో మనోడికి 90 లేనిదే పూట గడవదు అనే బాపతు.

ఇక ఈ సినిమాపై హీరోతో పాటు చిత్ర యూనిట్ ఫుల్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. కానీ వారి ఆశలపై సెన్సార్ బోర్డు నీళ్లు కొట్టింది. మంగళవారం జరగాల్సిన సెన్సార్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్‌ను ఒక రోజుకు వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఏదేమైనా 90 ML సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన కార్తికేయకు రిలీజ్‌కు ముందే సెన్సార్ బోర్డు వారు దెబ్బేయడంతో ఇప్పటికైనా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి రిజల్ట్ ఇచ్చారనేది చూడాలి.

Leave a comment