తిరుమలలో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూలో వినియోగించే బూందీ తయారు చేసే పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తిరుమలలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే అగ్నిప్రమాద స్థాయి చిన్నది కావడంతో ఎలాంటి భారీ నష్టం వాటిల్లలేదు.

బూందీ తయారు చేసే పోటులో గోడలకు ఉన్న నెయ్యి మరకలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. 3 అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా మంటలు అదుపు చేసు క్రమంలో ఓ కార్మికుడికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఏదేమైన పవిత్ర తిరుమల క్షేత్రంలో అగ్నిప్రమాదం జరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో, అధికారుల సమయస్ఫూర్తితో కేవలం ఆస్తినష్టం మాత్రమే వాటిల్లింది. ఈ ప్రమాదంపై తితిదే అధికారులు విచారణ చేస్తున్నారు.

Leave a comment