వెంకీ మామలో అదే హైలైట్

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటిస్తోన్న తాజా మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ ప్రస్తుతం టాలీవుడ్ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ సినిమాతో మామా అల్లుళ్లు బ్లాక్‌‌బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలోని కథ అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఓ 40 నిమిషాల పాటు సినిమా కథ అందరినీ ఆకట్టుకోవడం పక్కా అని వారు తెలుపుతున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్య ఆర్మీలో పనిచేస్తున్న సైనుకుడిగా కనిపిస్తాడు. దీంతో దేశం కోసం చైతూ చేసే త్యాగం, అతడికి అండగా నిలిచే మామ(వెంకటేష్) యాక్టింగ్ సినిమాలో మరో లెవెల్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కశ్మీర్‌లో నడిచే ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.

ఏదేమైనా వెంకీ మామ సినిమాలో మామ అల్లుళ్లు కలిసి చేసే సీక్వెన్సులు సినిమాకు నిజంగానే హైలైట్‌ కానున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్టోండగా బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి.

Leave a comment