రూలర్ ట్రైలర్ టాక్: విధ్వంసం సృటించిన బాలయ్య

నందమూరి బాలయ్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రూలర్’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఏపీ రాజకీయాల కారణంగా కొంత గ్యాప్ తీసుకుని బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాయి.

కాగా తాజాగా రూలర్ చిత్రానికి సంబంధించిన రూలర్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో బాలయ్య మరోసారి తన విశ్వరూపం చూపించారు. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగులతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్‌లో సినిమా కథను రివీల్ చేశారు చిత్ర యూనిట్. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య లుక్ కేక.

తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తోండగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చూస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. మరి బాలయ్య రూలర్ సినిమాతో బాక్సాఫీస్‌ను రూల్ చేస్తాడా లేడా అనేది చూడాలి.