అంతుచిక్కని డిస్కో రాజా టీజర్

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజా’పై మొదట్నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూసి ఇదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా అని ఫిక్స్ అయిపోయారు అందరు.

కానీ తాజాగా రిలీజ్ అయిన డిస్కో రాజా టీజర్ చూస్తే అందరి అంచనాలను తలకిందలు చేశారు చిత్ర యూనిట్. ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు టీజర్ చూస్తే ఇట్టే అర్ధం అవుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌కు తెలియకుండా ఓ ప్రాజెక్ట్‌ను చేస్తాడు విలన్ బాబీ సింహా. దీనికోసం రవితేజను వాడుకుంటాడు. అయితే అది ఎలాంటి ప్రాజెక్ట్, రవితేజ ఏమవుతాడు, దీంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సినిమా కథ.

మొత్తానికి చూస్తే ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అని టీజర్‌లో చెప్పేశాడు దర్శకుడు విఐ ఆనంద్. తన గత చిత్రాల లాగా ఈ సినిమా కూడా కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించాడు దర్శకుడు. అయితే ఇది మన తెలుగు ఆడియెన్స్‌కు ఎంత వరకు ఎక్కుతుందనే అంశం మాత్రం సినిమా రిలీజ్ అయిన తరువాతే తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, నభా నటేస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Leave a comment