కొరటాల సినిమాకు మెగా డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసినా సినిమా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. దీంతో ఈ సినిమా వస్తుందా లేదా, సినిమా వాయిదా పడిందంటూ పలు పుకార్లు ఇండస్ట్రీలో వినిపించాయి.

కాగా ఆ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 26 నుంచి జరపనున్నట్లు చిరు అండ్ టీమ్ తెలిపారు. ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ త్రిషను ఎంపిక చేశారు చిత్ర యూనిట్. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను కొరటాల పక్కా కథతో తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమాను 2020 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు కొరటాల కసరత్తు చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment