సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తోన్న తారక్.. మోతమోగాల్సిందే అంటోన్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మూవీ RRRలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో తారక్ మార్కెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగతా స్టార్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చాటుతున్నాడు తారక్. కాగా తారక్‌కు మిగతా ఇండస్ట్రీ మార్కెట్‌లలో పెద్దగా ఇమేజ్ లేదనేది వాస్తవం. ముఖ్యంగా తమిళంలో తారక్ మార్కెట్ చాలా తక్కువ. అందుకే రాజమౌళి అదిరిపోయే ప్లాన్ వేసి తారక్ మార్కెట్‌ను తమిళంలో పెంచాలని చూస్తున్నాడు.

RRR రిలీజ్ అయ్యే సమయానికి తారక్‌కు మంచి మార్కెట్ ఉండేలా, తమిళంలో తారక్ సినిమాను సైలెంట్‌గా నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్‌లో 12 ఏళ్ల క్రితం వచ్చిన యమదొంగ తెలుగు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో తారక్ సక్సెస్‌ బాట పట్టి ఆపై వెనక్కి చూడలేదు. ఇక తారక్ యాక్టింగ్‌కు, డైలాగ్ డెలివరీకి ఫుల్ మార్కులు పడ్డ ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో తారక్‌కు అదిరిపోయే హిట్‌ను అందించిన యమదొంగ సినిమా తమిళంలో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా తమిళంలో తారక్ అంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ట్రీట్ అనే చెప్పాలి. విజేయన్ అనే పేరుతో వస్తున్న ఈ సినిమా అక్కడ విజేతగా నిలుస్తుందో లేదో నవంబర్ 29న తెలుస్తోంది.

Leave a comment