యాక్షన్ ముగించుకున్న హీరోలు.. అందాల కోసం జక్కన్న ఆరాటం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందంటూ చిత్ర యూనిట్ పేర్కొనడటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు సినీ జనం. అయితే ఇటీవల ఈ సినిమాలో తారక్ సరసన నటించే హీరోయిన్, ఇతర విలన్, నటీనటుల పేర్లను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ సినిమా యూనిట్ నుండి వినిపిస్తోంది. ఈ సినిమాలో మెజారిటీ యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌కు సంబంధించిన సీన్లను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-ఒలివియా మారిస్, చరణ్-ఆలియా భట్‌ల మధ్య ప్రేమాయణాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోండగా, డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను 30 జూలై 2020లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment