అసురన్ కోసం వెంకీ మామ జాగ్రత్తలు

రీమేక్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే హీరో వెంకటేష్ మరోసారి అదే ఫార్ములాతో మనముందుకు రాబోతున్నాడు. బ్రహ్మోత్సవం లాంటి అమృతాంజన్ సినిమాను అందించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తి చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. అయితే ఈ సినిమా విషయంలో హీరో వెంకటేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ధనుష్ నటించిన ఈ రస్టిక్ విలేజ్ డ్రామాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మలిచేందుకు పలు సూచనలు చేస్తున్నాడు హీరో వెంకటేష్. ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు వెంకీ మామ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ఎలాంటి సక్సెస్ అయ్యిందో తెలుగులోనూ అలాంటి సక్సెస్ చేయాలని వెంకటేష్ ప్లాన్ చేస్తున్నాడు. స్క్రిప్టులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు వెంకటేష్.

శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకంతో వెంకటేష్ అండ్ కో ఈ సినిమా బాధ్యతలు ఆయనకు అప్పగించారు. కాగా వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్మ చేయకుండా ఉండేందుకు అడ్డాల అదిరిపోయే రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు. మరి అసురన్ రీమేక్ తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment