యాక్షన్ ఫైనల్ రిజల్ట్.. విశాల్ దెబ్బకు అల్లాడుతున్న బయ్యర్లు

తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ యాక్షన్ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై తమిళ వర్గాలతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడమే. ఈ సినిమాను దర్శకుడు సి.సుందర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

తెలుగులో కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా తెలుగు హక్కులు 6.7 కోట్లకు అమ్మడయ్యాయి. కానీ సినిమా రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.2.87 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మరో 7.2 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

కానీ అంత మొత్తం కలెక్ట్ చేయడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఈ సినిమా పూర్తి కలెక్షన్లు ఎంతనేది ట్రేడ్ వర్గాలు వెల్లడించాల్సి ఉంది. అటు తమిళంలో ఈ సినిమా యావరేజ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను కొన్న తెలుగు బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు.

Leave a comment