హీరో రాజశేఖర్‌కు పోలీసుల ఝలక్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వాహనం ఇటీవల యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో ఆయనకు పెద్దగా గాయాలు ఏమీ కాకపోవడంతో రాజశేఖర్ కుటుంబంతో పాటు ఇండస్ట్రీ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గతంలోనూ రాజశేఖర్ వాహనానికి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు. రాజశేఖర్ వాహనం ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ఏకంగా 21 సార్లు ఓవర్‌స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. అత్యధికంగా గంటకు 160 కి.మీ వేగంతో రాజశేఖర్ వాహనం ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సును వారు రద్దు చేయాలని వారు తెలిపారు.

ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై రాజశేఖర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ర్యాష్ డ్రైవింగ్‌తో తమ లైసెన్సును రద్దు చేసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యిందనే చెప్పాలి.

Leave a comment