ఇస్మార్ట్ బ్యూటీలతో మెగా హీరో రొమాన్స్

గద్దలకొండ గణేష్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ ఓ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ సరసన అందాల భామ కియారా అద్వానీని సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు.

కానీ ఆమె ఫుల్ బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదు. దీంతో ఆ ఆఫర్ కాస్త ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్‌ వద్దకు వెళ్లింది. వరుణ్ తేజ్, నిధి అగర్వాల్ కాంబినేషన్ వెండితెరపై చాలా బాగుంటుందని చిత్ర యూనిట్ భావించారు. దీంతో నిధి అగర్వాల్‌ను ఈ సినిమాలో నటించాల్సిందిగా వారు కోరారు. అమ్మడు కూడా వెంటనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో మరో హీరోయిన్‌గా నభా నటేష్ నటించనుంది. అయితే ఆమెది ఎలాంటి పాత్ర అనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు.

మొత్తానికి పూరీ జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని హీరోయిన్లు మెగా హీరో వరుణ్‌తో నటించే ఛాన్స్‌ను కొట్టేయడంతో వారు యమహ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తు్న్నారు.

Leave a comment