సరిలేరు నీకెవ్వరు రన్‌టైం ఫిక్స్

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే భీబత్సమైన అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా రన్‌టైంను చిత్ర యూనిట్ లాక్ చేశారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రన్‌టైంను 2 గంటల 30 నిమిషాలకు ఫిక్స్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ రన్‌టైంతో సినిమాకు మేజర్ హెల్ప్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ పుష్కలంగా ఉన్నాయంటూ చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా ప్రేక్షకులకు అన్ని విధాలా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తోండగా అలనాటి హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మహేష్ అండ్ కో రెడీ అయ్యారు.

Leave a comment