ఎద అందాల భామ.. ఎందుకు వేసుకుందో రామ!

బాలీవుడ్ బ్యూటీలు అందాల ఆరబోత కోసం ఎంతవరకైనా రెచ్చిపోతారు. అలాంటిది ఫాంలో ఉన్న హీరోయిన్లు అయితే ఏకంగా బికినీ షోలతో రెచ్చిపోయి ఆడియెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. అలాంటిది వారు వేసుకునే డ్రెస్సులతో తమ ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటారు. ఇలాంటిదే చేయబోయిన ఓ బ్యూటీపై పాపం పోలీసు కేసు నమోదు కావడంతో ఆమె షాక్‌కు గురైంది.

బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ సినిమాల్లో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంటుంది. ముద్దు సీన్లు మొదలు కొని బికినీల వరకు అమ్మడి అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఇక ఫోటోషూట్స్‌లో అయితే అమ్మడి ఎక్స్‌పోజింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కాగా తాజాగా ఆమె తన ఎద అందాల ఆరబోత కోసం వేసుకున్న ఓ బ్లౌజ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దానికి కారణం ఆ బ్లౌజ్‌పై శ్రీరామ అనే అక్షరాలు ఉండటం. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు హిందూ సంఘాలు వాణి కపూర్‌పై విరుచుకుపడ్డాయి. అంతేగాక ఏకంగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆమెపై పోలీసుల కేసు కూడా నమోదు చేశాడు.

దీంతో ఆ ఫోటోషూట్ ఎందుకు చేశానురా దేవుడా అంటూ వాణి కపూర్ ఫీల్ అవుతోందట. ఏదేమైనా కాసుల కోసం కక్కుర్తి పడ్డందుకు ఆమెకు తగిన శాస్తి జరగాలంటూ పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరి వాణి కపూర్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఆమెకు సంబంధం లేని విషయంలో ఆమెపై కేసు నమోదు చేయడం సమంజసం కాదంటున్నారు ఆమె అభిమానులు. మరి ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో చూడాలి.

Leave a comment