మోసగాళ్ళ అంతు చూస్తానంటున్న మంచు విష్ణు

మంచు ఫ్యామిలీ నుండి హీరోలుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ చాలా సినిమాలు చేసినా ఎందుకో వారికి సరైన హిట్స్ పడటం లేదు. యాక్టింగ్‌లో ఇద్దరు హీరోలు మంచి మార్కులే కొట్టేసినా అదృష్టం మాత్రం వారిని వరించడం లేదు. దీంతో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేస్తోంది. అయితే ఈసారి మంచు విష్ణు ఓ సరికొత్త అవతరాంలో రాబోతున్నట్లు తెలుస్తుంది.

విష్ణు తాజాగా నటిస్తోన్న చిత్రం మోసగాళ్ళు. ఈ సినిమాను ఓ హాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. ఔట్ అండ్ ఔట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విష్ణు పాత్ర ఏమిటనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. అయితే విష్ణు పాత్ర పేరు అర్జున్ అని మాత్రం తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో విష్ణుకు సోదరిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో డైరెక్ట్ చేస్తుండటంతో ఇది ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో అని ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాను 2020 వేసవిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Leave a comment