బన్నీ సినిమాను మక్కీకి మక్కీ దించేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనం. అయితే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ వరుసబెట్టి పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

ఇక ఈ టీజర్‌లో మెజారిటీ శాతం మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించాడు. ఆయన యాక్టింగ్‌కు మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. కాగా ఈ టీజర్‌ను మహేష్ ఫ్యాన్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచేలా చేశారు. అయితే ఈ సినిమా కాపీ సినిమా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా యాంటీ మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కథను అల్లు అర్జున్ నటించిన ఓ సినిమా నుండి ఎత్తేశారని అంటున్నారు.

బన్నీ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథను ఈ సినిమాలో వాడినట్లు వారు అంటున్నారు. అందులో కూడా బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కానీ దీన్ని మహేష్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఆడియెన్స్‌కు కావాల్సినంత యాక్షన్ డోస్‌ పుష్కలంగా ఉందని టీజర్ చూస్తే తెలుస్తోంది. సంక్రాంతి రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Leave a comment