తెనాలి రామకృష్ణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. మళ్లీ మిస్ అయిన టార్గెట్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ ఇటీవల రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్న సందీప్ ఆశలు మరోసారి ఆశలుగానే మిగిలాయి.

కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించవచ్చని నమ్మిన సందీప్ కిషన్ దానికి తగ్గట్టుగా కథను ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో అతడు చేసిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఈ సినిమాకు తొలి మూడు రోజులు పూర్తి చేసుకునే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.1.55 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు(కోట్లలో)
నైజాం – 0.59 కోట్లు
సీడెడ్ – 0.17 కోట్లు
నెల్లూరు – 0.08 కోట్లు
కృష్ణా – 0.15 కోట్లు
గుంటూరు – 0.12 కోట్లు
వైజాగ్ – 0.20 కోట్లు
తూ.గో – 0.14 కోట్లు
ప.గో – 0.10 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 1.55 కోట్లు

Leave a comment