పవన్ కళ్యాణ్‌తో సినిమాకు నో చెప్పిన గబ్బర్ సింగ్ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మేకప్ వేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలో పవన్ నటించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఇది బాలీవుడ్ సినిమా పింక్‌కు రీమేక్ కానుందనే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో జోరందుకుంది. కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఆఫర్‌ను గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ వదులుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి తనదైన కారణాలు చెబుతున్నాడు గద్దలకొండ గణేష్ దర్శకుడు. ఈమధ్య రీమేక్ కథలతో కాలం నెట్టుకొస్తున్న హరీష్ శంకర్, మరోసారి పవన్ కళ్యాణ్‌తో హిందీ రీమేక్ కథను తెరకెక్కించేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది. తన సొంత కథ కుదిరినప్పుడే మళ్లీ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటూ హరీష్ చెప్పాడట.

అయితే హరీష్ శంకర్ గతంలో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు మాత్రం రీమేక్ సినిమాలు అడ్డు రావా అంటూ పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం హరీష్ నోరు విప్పాల్సిందే.

Leave a comment