అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌తో సూపర్ హిట్ రీమేక్.. వర్కవుట్ అవుతుందో లేదో?

ఇటీవల తమిళంలో హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కంటెంట్‌తో పాటు ధనుష్ అదిరిపోయే యాక్టింగ్‌కు తమిళ తంబీలు ఫిదా అయ్యారు. దీంతో సినిమా ధనుష్ కెరీర్‌లో నటనపరంగా మంచి సినిమాగా పేరొందింది. ఇక తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం సురేష్ బాబు ఓ అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచిన బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలతో అసురన్ సినిమాను రీమేక్ చేయించేందుకు సురేష్ బాబు నిర్ణయించాడు.

మొత్తానికి అసురన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల లాంటి డైరెక్టర్ ఎలా తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి ఫిల్మ్ నగర్ వర్గాల్లో నెలకొంది. ఏదేమైనా సురేష్ బాబు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా అని వెంకటేష్ అభిమానులు అనుకుంటున్నారు.

Leave a comment