జార్జి రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇటీవల కాలంలో బయోపిక్ చిత్రాల హవా జోరుగా కొనసాగుతోంది. మహానటి చిత్రంతో సావిత్రి బయోపిక్‌ను తెరకెక్కించగా, కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల రూపంలో నందమూరి తారకరామారావు జీవితగాధను మనముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధుల్లో ఉద్యమాన్ని రేకెత్తించిన నాయకుడిగా జార్జి రెడ్డి నిలిచిచాడు. ఆయన జీవిత ఆధారంగా జార్జిరెడ్డి అనే పేరుతో నేడు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
జార్జి రెడ్డి(సాండీ) కేరళలో జన్మస్తాడు. చిన్నప్పటినుండు చాలా చురుకుగా ఉండే అతడు, చెగువేరా, భగత్‌సింగ్ అంటే చాలా ఇష్టం. అతడు చదువులోనూ చాలా చురుకుగా ఉంటూ దూసుకెళ్లేవాడు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం వచ్చిన సాండీ అక్కడ విద్యార్ధలు గ్రూపులుగా ఏర్పడి నానా హంగామా చేస్తుంటారు. యూనివర్సటిలో మంచి పేరుతో పాటు విద్యార్ధి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. కాగా ప్రత్యర్థి విద్యార్ధి నాయకులు జార్జి రెడ్డిపై పగ పెంచుకుని అతడిని చంపాలని చూస్తారు. ఈ క్రమంలో విద్యార్ధుల హక్కుల కోసం పోరాడే జార్జి రెడ్డిని ప్రత్యర్ధులు ఏం చేశారు..? చివరకు అతడి స్ఫూర్తితో తోటి విద్యార్ధులు ఏం చేశారనేది సినిమా కథ.

విశ్లేషణ:
విద్యార్ధి నాయకుడి జీవితగాధను తెరకెక్కించిన తీరు నిజంగా సూపర్. మనం మర్చిపోయిన విద్యార్ధి యోధుడిని మనకు మరోసారి గుర్తు చేశారు ఈ సినిమా ద్వారా. ఇక సినిమా కథనం విషయానికి వస్తే, ఫస్టాఫ్‌లో జార్జి రెడ్డి చిన్నతనం, అతడి విద్యాభ్యాసం గురించి చూపించారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి ఎంట్రీ సీన్ చాలా బాగా చూపించారు. ఇక అక్కడి నుండి సినిమాపై ఆసక్తి కలుగుతుంది. ఒక అదిరిపోయే యాక్షన్ సీన్‌తో జార్జి రెడ్డి ఇంటర్వె బ్యాంగ్ అదరిపోయింది.

అటు సెకండాఫ్‌లోనూ అంతే క్యూరియాసిటీతో సినిమాను తెరకెక్కించారు చిత్ర దర్శకుడు. ముఖ్యంగా విద్యార్ధుల మధ్య జరిగే యాక్షన్ సీన్ పీక్స్. ఇక ఈ క్రమంలో జార్జి రెడ్డిని హతమార్చేందుకు చేసే ప్రయత్నాలు, వాటి నుండి అతడు తప్పించుకునే విధానం బాగా చూపించారు. ఇక ప్రీక్లైమాక్స్ సీన్‌లో జార్జి రెడ్డి విద్యార్ధులను ఉద్దేశించి చెప్పే స్పీచ్ అదుర్స్. క్లైమాక్స్‌లో జార్జి రెడ్డిని హత్య చేసే సీన్‌తో సినిమా ముగుస్తుంది.

విద్యార్ధుల హక్కుల కోసం జార్జి రెడ్డి చేసే పోరాటాన్ని ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమాలో జార్జి రెడ్డిని చూసిన విద్యార్ధులు చేసే కేరింతలు అంతా ఇంతా కావు. ఓవరాల్‌గా ఈ సినిమా గతం మర్చిన ఓ విద్యార్ధి వీరుడిని మనకు మరోసారి చూపించింది.

నటీనటులు పర్ఫార్మెన్స్:
జార్జి రెడ్డి లాంటి నాయకుడి పాత్రలో నటించేందుకు చాలా గట్స్ ఉండాలి. అలాంటి పాత్రలో సందీప్ మాధవ్ నటన శభాష్ అనిపించుకుంది. అతడు చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ సూపర్. హీరోయిన్ ముస్కాన్ ఉన్నంతలో బాగా చేసింది. మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ సినిమా కథను తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డిని ఖచ్చితంగా అభినందించాలి. అతడు సినిమాలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఓ విద్యార్ధి నాయకుడి జీవితాన్ని ప్రెజెంట్ చేసిన విధానం సూపర్. ఇక సినిమాకు మరో మేజర్ అసెట్ సంగీతం. సురేష్ బొబ్బిలి అందించిన బీజీఎం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా:
జార్జి రెడ్డి : విద్యార్ధి లోకాన్ని మేల్కొల్పిన వీరుడి గాధ!

రేటింగ్:
3.0/5.0

Leave a comment