Gossipsబాలయ్యను భయపెడుతున్న మోక్షజ్ఞ

బాలయ్యను భయపెడుతున్న మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. ఇదే విషయమై నందమూరి బాలకృష్ణ కూడా గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అతడు త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడని బాలయ్య వెల్లడించాడు. అయితే ఇదంతా జరిగి చాలా రోజులే అవుతుంది.

ఇప్పుడు బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశ్నార్ధకంగా మారింది. మోక్షజ్ఞకు నటనపట్ల పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. దీంతో నందమూరి బాలయ్యకు సంబంధించిన వ్యాపారాలను అతడు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. నందమూరి నటనా పరంపరను బాలయ్య తరువాత కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే కొనసాగిస్తారా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి బాలయ్య అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి కుమారుడు సినీ రంగం ఎంట్రీ ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. కాగా బాలయ్య మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై నిర్ణయం అతడికే వదిలేసినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య కోసం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తాడా ఇవ్వడా అనేది కాలమే చెబుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news