లేడీ అమితాబ్ రీఎంట్రీ.. కేవలం ఒక్క సినిమాకే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడం ఖాయమని చిత్ర యూనిట్‌తో పాటు సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి కూడా తెలిసిందే.

విజయశాంతి రీఎంట్రీ అనగానే ఆమె అభిమానులు చాలా సంతోషించారు. కానీ వారికి ఆ సంతోషాన్ని ఎక్కువ లేకుండా చేసింది రాములమ్మ. వరుసబెట్టి సినిమాలు చేస్తుందని అనుకుంటే కేవలం ఒకే ఒక్క సినిమాను ఒప్పుకుని ఆమె తదుపరి చిత్రాలపై సస్పెన్స్ ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సరిలేరు నీకెవ్వరు తరువాత ఆమె ఎలాంటి సినిమాలు చేస్తుందా అని వారు ఆశగా చూస్తున్నారు.

ఏదేమైనా రాములమ్మ ఇలా ఒక్క సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఏమాత్రం సబబు కాదంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి విజయశాంతి తన నెక్ట్స్ సినిమాల గురించి ఏమైనా క్లూ ఇస్తుందో లేదో చూడాలి.

Leave a comment