పవన్ రీఎంట్రీకి రంగం సిద్ధం చేసిన క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు దూరమయ్యారు. పవన్ నటించిన లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి తరువాత పవన్ సినిమా లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఆయన మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నారు. కాగా పవన్ ఫ్యాన్స్‌కు ఊరట కలిగించే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

పవన్ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తమిళ నిర్మాత ఏఎం రత్నం పవన్‌తో ఓ సినిమాకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం క్రిష్ కూడా అదిరిపోయే సబ్జెక్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే నవంబర్ నెలలోనే పవన్ రీ-ఎంట్రీ మూవీ అఫీషియల్‌గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ రెమ్యునరేషన్ తీసుకోకుండా షేర్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a comment