ఇలాంటి సినిమా చేయాలని ఉంది – రవితేజ

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీకి మంచి టాక్, మంచి రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు కలెక్షన్ల పరంగా కొంచెం నెమ్మదించిన ఈ సినిమా వీకెండ్ ముగిసిన తరువాత పట్టాలెక్కింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేస్తోన్న ఖైదీ సినిమా చూసి మాస్ రాజా రవితేజ ఫుల్ ఫిదా అయ్యాడు.

కార్తీ చేసిన పాత్రకు ఆయన జీవం పోశాడని పొగడ్తలతో ముంచెత్తాడు. హీరోయిన్, సాంగ్స్ లాంటి అంశాలేమీ లేకుండా కేవలం కథనంతో కట్టిపడేసిన చిత్రంగా ఖైదీ తనకు బాగా నచ్చిందని రవితేజ తెలిపాడు. మాస్ అంశాలతో పాటు ఆడియెన్స్‌కు కావాల్సిన యాక్షన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందని ఆయన అన్నారు. ఈ సినిమా లాంటి సినిమాలో నటిస్తే ఆ అనుభూతి చెప్పలేనిదని రవితేజ అన్నారు.

మొత్తానికి ఖైదీ చిత్రం అటు ఆడియెన్స్‌తో పాటు అందరినీ అలరించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. మరి కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో సినిమా రన్ పూర్తయితే తెలుస్తోంది.

Leave a comment