ధనుష్ సినిమాను దించేస్తానంటున్న వెంకీ మామ

తమిళంలో హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం అసురన్ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన అసురన్ ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానకి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను పొందిన సురేష్ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో తెలుగు హీరో ఎవరైతే బాగుంటారని అనుకొని చివరకు వెంకటేష్ అయితే ఈ సినిమాకు పక్కాగా సరిపోతారని ఆయన్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసురన్ సినిమా బాగుందని గతంలోనూ వెంకటేష్ పొగడ్తలతో గుప్పడంతో ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌లో ఆయనే నటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం వెంకటేష్ నాగచైతన్యతో కలిసి వెంకీ మామా చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Leave a comment